Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కిదాంబి శ్రీకాంత్‌కి డిప్యూటీ క‌లెక్ట‌ర్ హోదా.. ఆమోదించిన ఏపీ శాస‌న‌స‌భ‌

  • గ‌తంలో పీవీ సింధుకు కూడా
  • ఈ ఏడాది నాలుగు సూప‌ర్ సిరీస్ టైటిల్స్ సాధించిన శ్రీకాంత్‌
  • ప్ర‌తిభ‌ను గుర్తించిన ఏపీ ప్ర‌భుత్వం
ఒలింపిక్ విజేత పీవీ సింధుకి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం డిప్యూటీ క‌లెక్ట‌ర్ హోదా క‌ల్పించిన సంగ‌తి తెలిసిందే. ఇదే దారిలో మ‌రో టాప్ ష‌ట్ల‌ర్ కిదాంబి శ్రీకాంత్‌కి కూడా ఇదే హోదాను క‌ల్పిస్తున్న బిల్లుకు ఏపీ శాస‌న‌స‌భ ఆమోదం తెలిపింది. ఈ సీజ‌న్‌లో నాలుగు సూప‌ర్ సిరీస్ టైటిల్స్‌ను సాధించిన శ్రీకాంత్, ప్ర‌స్తుతం త‌న కెరీర్లో అత్యుత్త‌మ ర్యాంకింగ్‌లో ఉన్నాడు. ప్ర‌పంచ పురుషుల సింగిల్స్ బ్యాడ్మింట‌న్ ర్యాంకింగ్స్‌లో శ్రీకాంత్ రెండో ర్యాంకులో ఉన్నాడు.

జూన్‌లో ఇండోనేషియా ఓపెన్‌తో ప్రారంభించి, ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌, డెన్మార్క్‌ ఓపెన్‌, ఫ్రెంచ్‌ ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌లు సాధించి శ్రీకాంత్ ఈ ఘ‌న‌త సాధించిన మొద‌టి భార‌తీయుడిగా రికార్డుకెక్కాడు. అంతేకాకుండా బీడబ్ల్యూఎఫ్‌ ప్రపంచ సూపర్‌ సిరీస్‌ ఫైనల్స్‌కు కూడా శ్రీకాంత్ చేరుకున్నాడు.
kidambi srikanth
deputy collector
badminton
PV Sindhu

More Telugu News